అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనానికి డోన్ విద్యార్థిని
NDL: డోన్ హై స్కూల్ విద్యార్థిని లిజా అంజుమ్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. TANA నిర్వహించే అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనం–2025లో పాల్గొనడానికి ఆమె ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా 101 మంది పాల్గొనే ఈ కార్యక్రమంలో లిజా అంజుమ్ గేయ విభాగంలో ఈ నెల 30న ప్రదర్శన ఇవ్వనుంది. ఈ అవకాశాన్ని కల్పించిన TANA ప్రముఖులకు ప్రిన్సిపల్ సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు.