ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఎమ్మెల్యే
BDK: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కొత్తగూడెం MLA, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు ఆదివారం CM రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చర్చలు జరిపినా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు తీవ్రఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే కార్మికులు నిరవధికసమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.