ఇందిరమ్మ చీరలతో కాంగ్రెస్ ప్రచారం..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 16 అవార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైద్యం కిరణ్ ప్రసాద్‌కు మద్దతుగా మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమవుతుందని ఈసారి హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు.