స్థానిక సమరంలో టీడీపీ జోరు

స్థానిక సమరంలో టీడీపీ జోరు

KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. కొణిజర్ల మండలం పెద్ద గోపతిలో అభ్యర్థి సునీత 1258 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అలాగే, మధిర మండలం అల్లినగరంలో అభ్యర్థి ఆవుల పెద్దిరాజు 89 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయాల పట్ల జిల్లా TDP శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.