ముగిసిన మండల సమైక్య సభ్యులకు శిక్షణా తరగతులు
ATP: రాప్తాడు మండల కేంద్రంలో విజన్ బిల్డింగ్ మాడ్యూల్ -1 పైన జ్యోతి మండల సమైక్య సభ్యులకు 4 రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ప్రాజెక్టు డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ.. ఈనెల 3 నుంచి జరిగిన ఈ శిక్షణ తరగతులలో సభ్యులకు రాబోయే ఐదేళ్లలో గ్రామ సమైక్య సంఘాలలో చేపట్టబోయే జీవనోపాదులు, వ్యవసాయం, పాడి, విద్య, తదితర అంశాలపై శిక్షణ ఇచ్చామన్నారు.