అంజన్న సన్నిధిలో వెస్ట్ రైల్వే భద్రత కమిషనర్
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం వెస్ట్ రైల్వే భద్రత కమిషనర్ శ్రీనివాసు మరియు గుంతకల్లు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.