గోదావరి ఒడ్డున మహిళ మృదేహం లభ్యం

గోదావరి ఒడ్డున మహిళ మృదేహం లభ్యం

E.G: కొవ్వూరు మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గోదావరి ఒడ్డున కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన చెరుకూరి సూర్యచక్ర(30) మృతదేహం లభ్యమైంది. గత నెల 21న ఇద్దరు కుమార్తెలతో కలిసి గౌరీపట్టణం మేరీ మాత ఉత్సవాలకు వచ్చిన ఈమె, తిరిగి ఇంటికి చేరలేదు. బుధవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరు పిల్లల ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.