తాటి చెట్టు పైనుంచి జారిపడి గీత కార్మికుడు మృతి

వరంగల్: ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి జారిపడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాయపర్తి మండలం కొత్తూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తూరు గ్రామానికి చెందిన గీతకార్మికుడు నాలం యాదగిరి (54) తాటి చెట్టు పైనుండి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.