చలి తీవ్రత.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

చలి తీవ్రత.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

SRD: చ‌లి వ‌ణికిస్తోంది.. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 10 జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.