ఇకపై ఆకాశ మార్గంలో సోమశిల, శ్రీశైలం పర్యటన
NGKL: తెలంగాణ టూరిజం శాఖ పర్యాటకులకు, భక్తులకు నూతన ఆకర్షణను అందిస్తోంది. ఇకపై ఆకాశ మార్గంలో సోమశిల, శ్రీశైలం సందర్శించే అవకాశం కల్పిస్తూ, ఈ నెల 9 నుంచి ప్రత్యేక హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నారు. జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణా నది సోయగాలు, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం ఒకే ప్యాకేజీలో అందించనున్నారు.