VIDEO: ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు
MDK: తూప్రాన్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ రేణుక ఎల్లమ్మకు బోనాల సమర్పణ కార్యక్రమం చేపట్టారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలలో బోనాల ఊరేగింపు శివసత్తుల పునకాలతో కన్నుల పండుగగా కొనసాగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.