నూతన బార్ లైసెన్స్‌పై సమావేశం

ప్రకాశం: గిద్దలూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌లో ఆదివారం ఎక్సైజ్ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బార్ లైసెన్స్ ఫీజు రూ.35 లక్షలు, రూ.6లక్షలు వాయిదా చెల్లించవచ్చన్నారు. ఇందులో భాగంగా దరఖాస్తు ఫీజుతో పాటు ప్రాసెసింగ్ ఛార్జీలు రూ.10వేలను చలానా రూపంలో చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. కాగా, ఈ విషయాన్ని ప్రకాశం జిల్లాల ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు తెలిపారు.