కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
JGL: ధర్మపురి మండలం నేరేళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. రైతులు కష్టపడి పండించిన వడ్లను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.