నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
MBNR: మహబూబ్‌నగర్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని జిల్లా సబ్ డివిజన్ ఏడిఈ తౌర్య నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలో బస్టాండ్ ప్రాంతం, తెలంగాణ చౌరస్తా, రైల్వే స్టేషన్ రోడ్, న్యూ టౌన్, జడ్జి క్వార్టర్స్, ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ బంగ్లా చౌరస్తాలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.