బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
SS: ధర్మవరం టీచర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సంధా రాఘవ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.