ఉక్రెయిన్‌ సర్కారు సహకరించాలి: ట్రంప్

ఉక్రెయిన్‌ సర్కారు సహకరించాలి: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకారం తెలపాలని అన్నారు. రష్యాకు భూభాగాలను అప్పగించేందుకు ఉక్రెయిన్ సమ్మతించాలని తాజాగా ఆయన సూచించారు. ప్రస్తుతం మాస్కోది పైచేయిగా ఉంది కాబట్టి జెలెన్‌స్కీ ప్రభుత్వం సహకరించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.