VIDEO: ఏడుపాయల దుర్గమ్మకు దశమి ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి దశమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం భృగు వాసరే పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పట్టు వస్త్రాలు, పలు ద్రవ్యాలు సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళహారతి నిరాజనం చేశారు.