ASIA CUP: 'స్టాండ్ బై'గా ఐదుగురు ప్లేయర్లు

అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుతో పాటు.. ఐదుగురు ఆటగాళ్లను 'స్టాండ్ బై'గా ఎంపిక చేసింది. అందులో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రియాన్ పరాగ్, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. జట్టులో ఏ ప్లేయరైనా గాయపడితే వీరిని జట్టులోకి తీసుకుంటారు.