శారద నదిలో మహిళ డెడ్‌బాడీ

అనకాపల్లి: దేవరాపల్లి మండలం మామిడిపల్లి సమీపంలోని శారద నదిలో గురువారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్లూస్ టీమ్‌లు రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.