వైసీపీ నాయకులతో మాజీమంత్రి రోజా సమావేశం

CTR: నగరిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి రోజా బుధవారం సమీక్ష నిర్వహించారు. పుత్తూరుకు చెందిన నాయకులతో ఆమె మాట్లాడారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పార్టీ పదవులు దక్కించుకున్న వారికి రోజా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.