స్విమ్మింగ్ లో బ్రాంజ్ మోడల్ తో మెరిసిన స్వరణ్
KMR: ఆదిలాబాద్ వేదికగా జరుగుతున్న సౌత్ జోన్ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్విమ్మర్ కంకణాల స్వరణ్ సత్తా చాటాడు. గ్రూప్-1 కేటగిరీలో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. స్వరణ్‌ను క్రీడా అధికారి శ్రీనివాస్ గౌడ్, స్విమ్మింగ్ అసోసియేషన్ ట్రెజరర్ కృష్ణమూర్తితో పాటు కోచ్‌లు అభినందించారు.