'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, అనుమతి లేకుండా గైర్హాజరు కాకూడదని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టాలని, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.