VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సూర్యాపేట: నాగారం గ్రామ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట-జనగాం ప్రధాన జాతీయ రహదారి-365పై స్థానిక హెచ్‌పీ పెట్రోల్ బంక్, కంకర మిల్లు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన సతీష్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.