బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు ధర్నా

బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు ధర్నా

SKLM: శ్రీకాకుళం సర్వజన (రిమ్స్) ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కార్మిక ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలంటూ మంగళవారం ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో జీతాలు చెల్లించకపోవడం వలన, కుటుంబ పోషణకు ఇబ్బందులకు గురవుతున్నామని ఆ సంఘం నాయకుడు మామిడి సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చర్చలకు పిలిచి మాట్లాడడం లేదన్నారు.