గుండెపోటుతో మృతి చెందిన పదవ తరగతి విద్యార్థిని

గుండెపోటుతో మృతి చెందిన పదవ తరగతి విద్యార్థిని

మహబూబాబాద్: పెద్ద గూడూరు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కొట్టం శ్రీవాణి 16 ఈరోజు గుండెపోటుతో మృతి చెందింది. ఇటీవల పదవ తరగతి సైన్స్ పరీక్ష రాస్తుండగా చాతిలో నొప్పి రావడంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 11 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీవాణి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.