ఘనంగా సర్పంచ్‌లకు సత్కారం
కృష్ణా: నందివాడ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ సత్కార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌లు చేసిన సేవలను గుర్తిస్తూ.. స్థానిక నేతలు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. వారు ప్రజలకు అందించిన సేవలు ఎనలేనివన్నారు.