గురుకులాల్లో ప్రతిభ కనబరిచిన కిన్నెరపల్లి విద్యార్థులు
ADB: బజారుహత్నూర్ మండలంలోని MPUPS కిన్నెరపల్లె విద్యార్థులు ఇటీవల నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు విద్యార్థులు వాగ్మారె దివ్య, హృష్ణాలే భాగ్యశ్రీ, సూర్యావంశీ రూపాలి, హరిగిలే సుమిత్‌లను పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, విజయ్ కుమార్, సిబ్బంది తదితరులున్నారు.