భార్య బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భర్త

భార్య బతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకున్న భర్త

KDP: బతికుండగానే భార్యకు డెత్ సర్టిఫికెట్ తీసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. కలసపాడు మండలం దూలం వారి పల్లెకు చెందిన పొన్న ఆదిలక్ష్మీ భర్త వేధింపులు భరించలేక 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. దీంతో సదరు మహిళ భర్త ఆమె పేరుతో డెత్ సర్టిఫికెట్ తీసుకుని పోస్ట్ ద్వారా ఆమెకు పంపాడు. బ్రతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని బాధితురాలు పోలీసులకు ఇవాళ ఫిర్యాదు చేసింది.