CC కెమెరాలు అమర్చుతూ కిందపడి వ్యక్తి మృతి

CC కెమెరాలు అమర్చుతూ కిందపడి వ్యక్తి మృతి

MNCL: జైపూర్ KGBV వసతి గృహంలో CC కెమెరాలు అమర్చుతూ శివ (29) అనే వర్కర్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు SI రాజశేఖర్ శనివారం తెలిపారు. స్టాండ్‌పై నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడన్నారు. మృతుడి అన్న విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.