జిల్లెల్లలో రేషన్ బియ్యం పట్టివేత
KDP: దువ్వూరు మండలం జిల్లెల్లలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. సమాచారం ఆధారంగా దాడులు జరిపి బియ్యం సీజ్ చేశారు. తహశీల్దార్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బియ్యాన్ని డీలర్‌కు అప్పగించారు. ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.