VIDEO: ఇరు వర్గాల మధ్య కొట్లాట.. 40 మందికి గాయాలు
SKLM: ఇచ్ఛాపురం మండలం డొంకూరు గ్రామంలో మత్స్యకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు చర్చనీయాంశమయ్యాయి. శుక్రవారం రాత్రి కూడా వారు మరోసారి ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో సుమారు 40 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా.. గ్రామంలోని ఓ షెడ్డు విషయంపై ఘర్షణ జరిగినట్లు సమాచారం.