ఆరో రోజు ముగిసిన IPS సునీల్ నాయక్ విచారణ
AP: గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ ఆరో రోజు ముగిసింది. దర్యాప్తు అధికారి దామోదర్ సుమారు 7 గంటల పాటు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది. కేసులో కీలక అంశాలపై స్పష్టత కోసం అధికారులు ఆయనను నిరంతరాయంగా ప్రశ్నిస్తున్నారు.