అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : అదనపు కలెక్టర్

MHBD: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా ప్రధాన కార్యలయ స్థానంలోనే ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను అన్ని శాఖల అధికారులు పాటించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి శాఖ అధికారులు వారి పరిధిలో విధులు నిర్వర్తించాలన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఎలాంటి నిర్లక్ష్యం వహించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.