ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం
ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో టీడీపీ క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. అబ్జర్వర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవులు పొందిన వారు ప్రమాణ స్వీకారం చేశారు.