'మోదీకి రాహుల్ హగ్'పై రిజిజు విమర్శలు
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. 2018లో ప్రధాని మోదీని రాహుల్ సభలో ఆలింగనం చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. విదేశాలకు వెళ్లి రాహుల్ దేశాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. భారత్‌లో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరుతున్నారని ఆరోపించారు.