ఒత్తిడిని జయించాలంటే వ్యాయామం తప్పనిసరి: MLA పాయల్
ADB: ప్రస్తుత కాలంలో మనిషి ఏ రంగంలో ఉన్నా విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తీసుకునే ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, నడక వంటి అంశాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.