ల్యాండ్ కబ్జా...12 మంది పై కేసు

KNR: నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఇంటి స్థలాన్ని కాజేయడంతో పాటుగా డబ్బులు దోపిడీ చేసిన 12 మంది పై కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. బ్యాంకు కాలనీకి చెందిన బాధితుడు యుగేందర్ ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీస్‌లు ప్రకటనలో వెల్లడించారు.