గిరిజనులందరు ఆధార్ క్యాంపులను వినియోగించుకోవాలి

NLR: ఆధార్ కార్డ్ లేని గిరిజనులకు ఆధార్ కార్టుతో పాటు గుర్తింపు కల్పించడం కోసం నేటి నుంచి 13 తేదీ వరకు 6 రోజులపాటు ప్రత్యేక క్యాంప్ జరుగుతుందని MPDO కట్టా శ్రీనివాసులు తెలిపారు. 8 తేదీన యర్రారెడ్డిపాలెం, తిమ్మారెడ్డిపాలెం గ్రామ సచివాలయాలలో, 9 తేదీన పెద్దపవని 1,2 సచివాలయాలలో, 10 తేదీన పెంట్రాల, మొగిలిచర్ల సచివాలయాలలో స్పెషల్ ఆధార్ క్యాంప్ నిర్వహిస్తారని అన్నారు.