జగన్ ఫేక్ ప్రచారానికి కూటమి చెక్: MLA
PLD: జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారానికి కూటమి ప్రభుత్వం ఫ్యాక్ట్స్‌తో సమాధానం ఇస్తుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ అసెంబ్లీలో లేవనెత్తే ప్రతి అంశానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని చెప్పారు. చట్టసభలను గౌరవించకుండా మీడియా ముందు ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని విమర్శించారు.