టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ సీఐ రమణ ఆధ్వర్యంలో సిబ్బంది కార్యాలయంలోని పలు రికార్డులను కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు, సిబ్బంది పనుల కోసం లంచం అడిగితే ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.