పైడిపాకలో పోలీసుల 'పల్లె నిద్ర'

పైడిపాకలో పోలీసుల 'పల్లె నిద్ర'

ELR: నేర రహిత సమాజం కోసం పోలవరం పోలీసులు పైడిపాకలో మంగళవారం 'పల్లె నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. సీఐ బాల సురేశ్, ఎస్సై పవన్ కుమార్ గ్రామస్థులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళా భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. ప్రజలకు, పోలీసులకు మధ్య దూరం తగ్గించి నమ్మకాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఐ తెలిపారు.