కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తా: ఎమ్మెల్యే

కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తా: ఎమ్మెల్యే

బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కృషిచేస్తోందని బాటప్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ రాజు అన్నారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యేను ఆయన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం తరలివచ్చారు.