రేపు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం

రేపు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం

HYD: నగరంలో శనివారం నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదర్ నగర్ నుంచి అల్వాల్ వరకు 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్ లైన్‌కు షాపూర్ నగర్ వద్ద పైప్‌లైన్‌కు మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.