జేసీబీ నడిపిన ఎమ్మెల్యే కందికుంట
SS: కదిరిలో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. 'జలధార' స్ఫూర్తితో వాగులను అనుసంధానిస్తూ ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా జేసీబీ నడిపి పనులను ప్రారంభించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సాగునీటి వనరుల రక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.