మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

WGL: జర్నలిస్టులపై దాడిచేసిన నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు డిమాండ్ చేశారు. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఎదుట మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు నిరసనను తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించి ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని కోరారు.