దేశంలో ఇంధనం కొరత.. HPCL క్లారిటీ

దేశంలో ఇంధనం కొరత.. HPCL క్లారిటీ

దేశంలో ఇంధనం కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై HPCL స్పందించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో అవసరమైన ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.