వాడపల్లి వెంకన్న సన్నిధిలో ఇంటిలిజెన్స్ డీఎస్పీ
కోనసీమ: అత్రేయపురం మండలం పరిధిలోని వాడపల్లిలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ఇంటిలిజెన్స్ డీఎస్పీ పి. ఈశ్వరుడు కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు.