'పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత'

ATP: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లిలో ఆయన పర్యటించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవన్నారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.