గ్రామ సంఘాలకు కోడిపిల్లల పంపిణీ

గ్రామ సంఘాలకు కోడిపిల్లల పంపిణీ

NRML: తానూరు మండలంలోని 30 గ్రామ సంఘాలకు చెందిన 125 మంది మహిళలకు 2,500 కోడిపిల్లలను పంపిణీ చేశారు. కోడిపిల్లల పెంపకంతో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఐకేపీ ఏపీఎం సులోచనరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీవో నసీరుద్దీన్, డీపీఎం శోభ, ఫామ్ ఏపీఎం అర్జబాయి, సీసీలు సాయినాథ్, సవిత, భోజన్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు మంగళ పాల్గొన్నారు.