VIDEO: 'డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలి'
KMM: ఖమ్మం 58వ డివిజన్ ప్రజల పాలిట శాపంగా మారిన డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలని, తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ డిమాండ్ చేశారు. సీపీఎం టూటౌన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక డంపింగ్ యార్డ్ వద్ద నిరసన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు జె.వెంకన్న బాబు, శెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.